3 వారాల్లో లాభాల కోసం ఈ 10 స్టాక్స్

3 వారాల్లో లాభాల కోసం ఈ 10 స్టాక్స్

మార్కెట్లలో మళ్లీ 2017 రోజులు వచ్చినట్లు లైఫ్‌టైమ్ హై మార్క్స్ క్రియేటవుతున్నాయ్. ఇన్వెస్టర్లు మళ్లీ తమ డబ్బాలు కదిలించి పెట్టుబడులకు సిద్దం అవుతున్నారు. ఈ దశలో నిఫ్టీకి హయ్యర్ లెవల్స్ వద్ద నిరోధాలను ఎదుర్కొంటుంది.తప్పితే స్టాక్స్ మంచి హుషారు మీద కన్పిస్తున్నాయ్. ఎందుకంటే ఇప్పటిదాకా పెరగని స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా నష్టపోయిన షేర్లు తిరిగి తమ పాత రేట్లకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇప్పుడు ఏ స్టాక్స్ అలాంటి జోరు ప్రదర్శించవచ్చనే అంశంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఓ 10 షేర్లని రికమండ్ చేస్తున్నాయ్..మూడంటే మూడే వారాల్లో ఈ టార్గెట్లు వచ్చేస్తాయని చెప్తున్నారు

Analyst: Milan Vaishnav, Technical Analyst, Gemstone Equity Research and Advisory
Piramal Enterprises | Buy | Target: Rs 2,795 | Stop Loss: Rs 2,580
ఒక విశాలమైన పరిధిలో ట్రేడైన తర్వాత పిరమాల్ ఎంటప్రైజెస్ ఇప్పుడు బ్రేకవుట్ దశలో ఉంది. వీక్లీ ఛార్ట్స్‌పైన ఎంఏసిడి కూడా బయ్ మోడ్‌ను సూచిస్తుండగా..అసెండింగ్ ట్రయాంగిల్ చార్టు ఏర్పాటు చేసింది. అలానే ఆర్ఎస్ఐ (రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్) కూడా 14 పీరియడ్ హైని టచ్ చేసింది.అందుకే షేరు ధర రూ.2795కి చేరుతుందని మిలన్ వైష్ణవ్ సూచిస్తున్నారు.స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా మెయిన్‌టైన్ చేయాలని ఆయన హెచ్చరిక

Godrej Industries | Buy | Target price: Rs 700 | Stop loss: Rs 615
ఏడాది క్రితం రూ.697 గరిష్టధరని తాకిన తర్వాత కిందకే తప్ప  పైకి చూడలేదు ఈ షేరు. అలానే రూ.500-550 మధ్య ఓ జోన్ ఏర్పాటు చేసుకుని అక్కడక్కడే చానాళ్లు ట్రేడైంది. ఇప్పుడు బ్రేకవుట్ ప్యాట్రెన్ నమోదు చేయగా..వీక్లీ ఆర్ఎస్ఐ ఛార్టులో 14 పీరియడ్ల హైని ఏర్పరచింది. కాబట్టి రూ.700 ధరని గోద్రెజ్ ఇండస్ట్రీస్ తాకుతుందని స్టాప్‌లాస్‌గా రూ.615ని పెట్టుకోమని వైష్ణవ్ సలహా

Analyst: Aditya Agarwala, Technical Research Analyst, YES Securities (India)
JK Lakshmi Cement | Buy | Target price: Rs 362/375 | Stop loss: Rs 323
అసెండింగ్ ట్రయాంగిల్(ఊర్ధ్వముఖ త్రికోణం) చార్ట్ నుంచి బ్రేకవుట్ కన్పిస్తుంది ఈ కౌంటర్‌లో. రూ.348 వద్ద నెక్‌లైన్ ఫామ్ అవగా..తొందర్లోనే షేరు ధర ఇక్కడ్నుంచి పైకే పయనిస్తుందని ఆదిత్య అగర్వాలా చెప్తున్నారు. అది కూడా మూడు వారాలలోపే చెప్పడం విశేషం. ఆర్ఎస్ఐ ప్రకారం ఈ షేరు రూ.335 వద్ద మద్దతు తీసుకుంటుంది. రూ.341-.343వద్ద కొనుగోలు చేస్తే..రూ.362-375 వరకూ పెరుగుతుందని చెప్తున్నారు. స్టాప్‌లాస్ రూ.323గా చూడాలి

Alembic Pharmaceuticals | Buy | Target price: Rs 625/680 | Stop loss: Rs 540
రూ.575పైన ట్రేడవుతున్న అలెంబిక్ ఫార్మాసూటికల్స్ ప్రస్తుతం అప్‌ట్రెండ్‌ కనబరుస్తోంది. ఈ ట్రెండ్‌లో రూ. 625..అది దాటితే రూ.680 వరకూ పెరుగుతందని టెక్నికల్ ఛార్ట్స్ చెప్తున్నాయట. కన్సాలిడేషన్ దశ నుంచి బైటపడి మంచి వాల్యూమ్స్‌తో షేరు ట్రేడవుతోంది. ఇది ఈ కౌంటర్‌లోని బుల్ రైడ్‌కి నిదర్శనంగా చెప్తున్నారు. రూ.625-680 టార్గెట్ ధరల కోసం  రూ.575-579 మధ్యలో కొనుగోలు చేయవచ్చని ఆదిత్య అగర్వాలా సూచిస్తున్నారు.స్టాప్ లాస్ మెయిన్‌టైన్ చేయడం తప్పనసరి

Mazhar Mohammad, Chief Strategist – Technical Research and Trading Advisory, Chartviewindia.in
Tata Global | Buy | Target price: Rs 280 | Stop loss: Rs 230
రూ.284 గరిష్ట ధరని తాకిన అనంతరం ఈ  కౌంటర్‌ కన్సాలిడేషన్ దశలో ఉన్నట్లుగా కన్పిస్తుంది. రూ.240 ధర వద్ద డీసెంట్ పుల్ బ్యాక్ ర్యాలీ నమోదు చేయవచ్చని మజర్ మహ్మద్ సూచిస్తున్నారు. అలానే రూ.249 ధర వద్ద కాస్త రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. ఈ స్థాయి కనుక దాటిందంటే షేరు మంచి స్పీడ్‌తో ముందుకెళ్లి రూ.280 టార్గెట్ అచ్చీవ్ చేస్తుందని సూచిస్తున్నారాయన. స్టాప్‌లాస్ రూ.230.


Vijaya Bank | Buy | Target price: Rs: 74 | Stop loss: Rs 52
ఇటీవలి కనిష్టధర అయిన రూ.49 నుంచి అప్‌స్వింగ్ నమోదు అవుతుంది విజయ బ్యాంక్ కౌంటర్‌లో. ఒక్క వారంలోనే రూ.65వరకూ పెరగడం గమనించవచ్చు. గత రెండు సెషన్లలో 15శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ కౌంటర్‌లో ట్రేడర్లు ఇప్పుడు కొనుగోలు..పడ్డప్పుడల్లా మళ్లీ కొనుగోలు అనే స్ట్రాటజీ అవలంబించాలని మజర్ చెప్తున్నారు. రూ. 76 వరకూ షేరు ధర పెరగవచ్చని ఆయన అంచనా. రూ.52 క్లోజింగ్ స్టాప్‌లాస్‌తో పొజిషినల్ ట్రేడర్లు రూ.74 టార్గెట్ ధర కోసం విజయ బ్యాంక్ షేరును కొనుగోలు చేయాలని రికమండ్ చేస్తున్నారు


Jindal Steel and Power | Buy | Target price: Rs 227 | Stop loss: Rs 190
జిందాల్ స్టీల్ అండ్ పవర్ తన గరిష్ట ధర అయిన రూ.265 నుంచి రూ.177వరకూ ఇటీవల పతనమైంది. ఐతే గత వారం ఈ కౌంటర్‌లో మంచి ర్యాలీ నడిచింది దీంతో ఈ షేరు కనీసం తన నష్టాలలో 62శాతం పూడ్చుకుంటుందని అంచనా. దీంతో పొజిషినల్ ట్రేడర్లు ఈ కౌంటర్లో రూ.227 టార్గెట్ ధర కోసం కొనుగోలు చేయవచ్చని మజర్ సూచించారు. స్టాప్‌లాస్ తప్పనిసరి

Vaishali Parekh, Head-Technical Desk, Prabhudas Lilladher
Crompton Greaves Consumer | Buy | Target price: Rs 270 | Stop loss: Rs 230
రూ.251 కనిష్టధరకి పతనమైన తర్వాత మంచి స్పీడ్‌తో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ బౌన్స్ అయింది. అలానే గత 200 డేస్ మూవింగ్ యావరేజ్( 200రోజుల సగటు)ను దాటింది. ఆర్ఎస్ఐ ఛార్టు కూడా బుల్లిష్ సంకేతాలు ఇస్తోంది. రూ.230 స్టాప్‌లాస్‌తో రూ.270 టార్గెట్ ధర కోసం కొనుగోలు చేయాలని వైషాలి పరేఖ్ సూచిస్తున్నారు


Motherson Sumi |Buy | Target price: Rs 342 |Stop loss: Rs 304
 రూ.280 ధరకి పడిన తర్వాత ప్రస్తుతం ఈ కౌంటర్‌లో బ్రేకవుట్ కన్పిస్తోంది. రూ.310-314 మధ్యలో మదర్సన్ సుమి కన్సాలిడేషన్ అయింది. దాన్ని కూడా  ఇప్పుడు దాటడంతో టెక్నికల్‌గా షేరు  బాగా పెరుగుతుందని ఆర్ఎస్ఐ, ఎంఏసిడి చార్టులు చెప్తున్నాయ్. అలానే లావాదేవీలు జరిగే షేర్ల సంఖ్య కూడా పెరగడంతో వైషాలి పరేఖ్ రూ.342వరకూ షేరు పెరుగుతుందని రికమండ్ చేస్తున్నారు


Nagaraj Shetti, Technical Research Analyst, HDFC Securities
CESC | Buy | Target price: Rs 1,060 |Stop loss: Rs 895
సిఈఎస్‌సి వీక్లీ టైమ్‌ఫ్రేమ్ ప్రకారం విస్త్రతి కలిగిన ధరల శ్రేణిలో ట్రేడవుతోంది. రూ.870వద్ద కన్సాలిడేషన్‌కు కనిష్టధర కాగా..అక్కడనుంచి ప్రతిసారీ పైకి పెరుగుతుంది.లాంగ్ బుల్ క్యాండిల్ చార్డులపై ఏర్పడటం, కనిష్టస్థాయిల వద్ద బయింగ్ ఇంట్రెస్ట్ పెరగడం షేరు ధర పెరుగుతుందనడానికి సంకేతాలుగా చెప్తున్నారు. ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేసి..ఓ వేళ మళ్లీ  పడినా తిరిగి యావరేజ్ చేయమని సూచిస్తున్నారు. రూ.895 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని రూ.1060 ధర వరకూ టార్గెట్ ధర ఫిక్స్ చేశారు నాగరాజ్ షెట్టి

 

( పై షేర్లన్నీ ఆయా అనలిస్టుల రికమండేషన్లు.లాభనష్టాలతో ప్రాఫిట్‌యువర్ ట్రేడ్.ఇన్‌కి సంబంధం లేదు)Most Popular