న్యూ లిస్టింగ్‌ : ఇన్వెస్టర్లను నిరాశపర్చిన TCNS క్లాతింగ్‌ 

న్యూ లిస్టింగ్‌ : ఇన్వెస్టర్లను నిరాశపర్చిన TCNS క్లాతింగ్‌ 

వుమెన్స్‌ అపెరల్స్‌ తయారీ సంస్థ TCNS క్లాతింగ్‌ ఇవాళ ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. ఇష్యూ ధర రూ.716 కాగా ఇవాళ ఉదయం రూ.715 వద్ద బీఎస్ఈలో లిస్టైంది. ఇంట్రాడేలో రూ.724కు తాకి ఆ వెంటనే కనిష్ట స్థాయి రూ.673కు పడిపోయింది. ప్రస్తుతం 4శాతం నష్టంతో రూ.688 వద్ద ట్రేడవుతోంది. 

ఢిల్లీకి చెందిన మహిళల బ్రాండెడ్‌ అపెరల్స్‌ సంస్థ TCNS క్లాతింగ్‌ ఐపీఓ 5.27 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. మొత్తం 1,09,99,828 షేర్లకు గాను 5,79,79,780 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కటాఫ్‌ ధర వద్ద మొత్తం 33,20,620 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యుఐబిల విభాగంలో 13.47 రెట్లు సబ్‌స్ర్కిప్షన్‌ రాగా రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 62 శాతం సబ్‌స్ర్కిప్షన్‌ మాత్రమే వచ్చింది. బుక్‌ బిల్ట్‌ పద్ధతిలో ఐపీఓకు వచ్చిన TCNS ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ను ఒక్కో షేరుకు రూ.714-716గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ.1,125 కోట్ల నిధులను కంపెనీ సమీకరించింది. 
 Most Popular