HDFC AMC ఐపీఓకు 83 రెట్ల స్పందన

HDFC AMC ఐపీఓకు 83 రెట్ల స్పందన

దేశంలోని రెండో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ HDFC అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) ఐపీఓ సూపర్‌హిట్‌ అయింది. నిన్నటితో ముగిసిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.2,800 కోట్లను సమీకరించనుంది. చివరి రోజూ పూర్తయ్యే సరికి ఈ ఇష్యూకు 83.06 రెట్ల ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. మొత్తం 1,88,04,290 షేర్లకు గాను 156,19,61,661 షేర్లకు బిడ్లు వచ్చాయి. ముఖ్యంగా సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది.

క్యూఐటీ పోర్షన్‌లో 192.26 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. మొత్తం 44,35,511 షేర్లకు గాను 85,27,59,362 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో ఎఫ్‌ఐఐల నుంచి 37,12,04,964 షేర్లకు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 21,67,02,226 షేర్లకు, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి 6,94,49,848 షేర్లకు, ఇతరుల నుంచి 19,54,02,324 షేర్లకు బిడ్లు వచ్చాయి. 

ఇక సంస్థాగతేతర ఇన్వెస్టర్లు కూడా ఎఫ్‌ఐఐ, డీఐఐలతో పోటీ పడి బిడ్లను దాఖలు చేశారు. ఈ పోర్షన్‌లో మొత్తం 195.15 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. మొత్తం 33,26,634 షేర్లకు గాను 64,91,83,951 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో కార్పొరేట్ల నుంచి 19,43,56,604 షేర్లకు, వ్యక్తిగతంగా (రిటైల్‌ ఇన్వెస్టర్లు కానివారు) 41,98,11,418 షేర్లకు, ఇతరుల నుంచి 3,50,15,929 షేర్లకు బిడ్లు వచ్చాయి. 

రిటైల్‌ పోర్షన్‌ విషయానికి వస్తే ఈ సెగ్మెంట్లో 6.73 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 7762145 షేర్లకు గాను 52227734 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో కటాఫ్ ధరలో 4,39,22,268, ప్రైస్‌ బిడ్లు 83,05,466 దాఖలయ్యాయి. ఇక ఎంప్లాయీస్‌ పోర్షన్‌లో 1.52 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఈ విభాగంలో మొత్తం 8.8 లక్షల షేర్లకుగాను 13.34 లక్షల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.     

ఐపీవోలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి షేరుకి రూ. 1100 ధరలో రూ. 730 కోట్ల నిధులను మంగళవారం సమీకరించింది. ఫిడిలిటీ, బ్లాక్‌రాక్‌, టెమాసెక్‌ తదితర పీఈ సంస్థలతోపాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, రిలయన్స్ ఎంఎఫ్‌, ఎస్‌బీఐ ఎంఎఫ్‌ తదితర కంపెనీలు ఇన్వెస్ట్‌ చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) 15.8శాతం మార్కెట్ వాటాను, 13.7% రిటైల్ వాటాను క‌లిగి ఉన్న‌ట్లు ఎంకే గ్లోబ‌ల్ బ్రోక‌రేజీ వెల్ల‌డించింది.Most Popular