ఈ స్టాక్స్‌ను ఎఫ్‌ఐఐలు ఎగబడి ఎందుకు కొంటున్నారంటే..

ఈ స్టాక్స్‌ను ఎఫ్‌ఐఐలు ఎగబడి ఎందుకు కొంటున్నారంటే..

గత కొంతకాలంగా దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) కొన్ని స్టాక్స్‌పై మాత్రం మక్కువ చూపుతున్నారు. గత త్రైమాసికంలో మొత్తం 65 స్టాక్స్‌పై ఎఫ్‌ఐఐలతో పాటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫండ్‌ హౌజ్‌లు ఆసక్తి చూపుతున్నాయని ఏస్‌ ఈక్విటీ తాజా డేటా విడుదల చేసింది. పలు బ్రోకరేజీ సంస్థలు ఆయా స్టాక్స్‌కు ‘Buy’ రేటింగ్‌నివ్వడం, భవిష్యత్‌ ఆశావాహంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాస్ట్‌ క్వార్టర్‌లో ఎఫ్‌ఐఐలు రూ.20వేల కోట్ల నిధులను వెనక్కి తీసుకోగా ఇదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు రూ.35వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. అయితే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అన్ని రంగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయగా, ఎఫ్‌ఐఐలు మాత్రం సెలెక్ట్‌ స్టాక్స్‌లోనే పెట్టుబడి పెట్టారు.  ఆటో విడిభాగాలు, ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు, సిమెంట్‌, కెమికల్స్‌, గ్రాఫైట్‌, ఐటీ, ఫార్మా, పవర్‌ షేర్లపై ఎఫ్‌ఐఐలు ఉత్సాహం చూపి భారీగా ఇన్వెస్ట్‌ చేశారు. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌లో ఎంఎఫ్‌లతో ఎఫ్‌ఐఐలు వాటా పెంచుకోవడంతో గత కొంతకాలంగా గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ షేర్ల విలువలు భారీగా పెరిగాయి.

గ్రాఫైట్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ వార్షిక రిపోర్ట్‌ ప్రకారం 2017లో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. అనూహ్య వృద్ధి నెలకొనడంతో ఈ స్టాక్‌ రాబోయే కాలంలో వేగంగా ఎదగనుందని పలు రీసెర్చ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ సంస్థ జెఫెరీస్‌ ఈ స్టాక్‌కు ‘Buy’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించి గ్రాఫైట్‌ ఇండియా టార్గెట్‌ ధర రూ.1,275గా అంచనా వేసింది.

ఇక మార్చి త్రైమాసికంలో లార్జ్‌క్యాప్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 2.80 శాతం నుంచి 3.28 శాతానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు వాటా పెంచుకున్నారు. ఇదే సమయంలో ఎఫ్‌ఐఐలు 24.46 శాతం నుంచి 24.53 శాతానికి వాటాను పెంచుకున్నారు. దీంతో గత త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 9శాతం లాభపడింది. రాబోయే రోజుల్లోనూ ఆర్‌ఐఎల్‌ చక్కని రిటర్న్స్‌ ఇచ్చే అవకాశముందని పలు గ్లోబల్‌ బ్రోకరేజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ "ఓవర్‌ వెయిట్‌" నిచ్చిన మోర్గాన్‌ స్టాన్లే టార్గెట్‌ ధరను రూ.1,241గా అంచనా వేసింది.

లార్జ్‌క్యాప్‌లో ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఆయిల్‌ ఇండియా వంటి షేర్లను ఎఫ్‌ఐఐలు ఉత్సాహంగా హోల్డ్‌ చేస్తున్నారు. వచ్చే త్రైమాసికాల్లో ఫార్మా స్పేస్‌లోని కేడిలా హెల్త్‌కేర్‌, సిప్లా, పైజర్‌లు చక్కని రిటర్న్స్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉన్నాయని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సిమెంట్‌ సెక్టార్‌లో అంబుజా సిమెంట్స్‌, హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌, ఓరియంట్‌ సిమెంట్‌, స్టార్ సిమెంట్‌, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌లపై  గత త్రైమాసికంలో ఎంఎఫ్‌లు, ఎఫ్‌ఐఐలు ఉత్సాహం చూపారు. 

ఇక మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, ఎంఫసిస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, సొనాటా, జెన్సార్‌ టెక్నాలజీస్‌లు ఎఫ్‌ఐఐలతో పాటు డిఐఐలను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. అలాగే ఎఫ్ఐఐలు ఉత్సాహంగా ఇన్వెస్ట్‌ చేస్తోన్న ఆయా స్టాక్స్‌ వివరాలేంటో దిగువ పట్టికలో చూద్దాం.Most Popular