రూపాయి రికవరీ!

రూపాయి రికవరీ!

డాలరుతో మారకంలో శుక్రవారం ఉదయం చరిత్రాత్మక కనిష్టాన్ని తాకిన దేశీ కరెన్సీ తదుపరి రికవరీ సాధించింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 21 పైసలు బలపడింది. డాలరుతో మారకంలో 68.84 వద్ద రూపాయి ముగిసింది. కాగా..  గురువారం(19న) ఏకంగా 43 పైసలు పతనమై 69.05 వద్ద ముగిసి కొత్త కనిష్టాన్ని నమోదు చేసుకున్న రూపాయి వారాంతాన(20న) మరోసారి డీలాపడింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 7 పైసలు బలహీనపడి 69.12కు చేరింది. ఇంట్రాడేలో ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. చివరికి బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. రూపాయి ఇంతక్రితం మే 29న 68.94 వద్ద ముగిసి కనిష్ట రికార్డును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్‌ రంగంలోకి దిగడంతో రూపాయి పుంజుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బ్యాంకులు డాలర్లను విక్రయించడంతోపాటు.. కొన్ని విదేశీ బ్యాంకులు డాలర్‌ ఫ్యూచర్స్‌లో షార్ట్‌ సెల్లింగ్‌ను చేపట్టినట్లు తెలియజేశాయి. కాగా.. గత మూడు నెలల్లో రూపాయి 5 శాతం పతనంకావడం గమనార్హం!Most Popular