క్యూ1 ఎఫెక్ట్‌- జీ మీడియా అప్పర్‌ సర్క్యూట్‌!

క్యూ1 ఎఫెక్ట్‌- జీ మీడియా అప్పర్‌ సర్క్యూట్‌!

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జీ మీడియా కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 28 సమీపంలో ఫ్రీజయ్యింది.
క్యూ1 భేష్
క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో జీ మీడియా కార్పొరేషన్‌ నికర లాభం రూ. 5 కోట్ల నుంచి రూ. 35 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో రూ. 41 కోట్లమేర అనూహ్య లాభం నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. నిర్వహణ లాభం రూ. 13 కోట్ల నుంచి రూ. 21 కోట్లకు పెరిగింది. దీనిలో అనూహ్య లాభాలు కలసిలేవని కంపెనీ వివరించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 35 శాతం పెరిగి రూ. 155 కోట్లకు చేరింది. Most Popular