ఐటీ, ఫార్మా జోరు- మెటల్‌ వీక్‌-మార్కెట్‌ ప్లస్‌!

ఐటీ, ఫార్మా జోరు- మెటల్‌ వీక్‌-మార్కెట్‌ ప్లస్‌!

తాజాగా అమెరికా-యూరోపియన్‌ యూనియన్‌ మధ్య వాణిజ్య వివాదాలు తలెత్తనున్న సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. దేశీయంగా పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీకి చేరువకాగా... నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయికి ఎగువన కదులుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 163 పాయింట్లు ఎగసి 36,514కు చేరగా నిఫ్టీ 53 పాయింట్లు పురోగమించి 11,010 వద్ద ట్రేడవుతోంది. 
బజాజ్‌ ఆటో డౌన్‌
ఎన్‌ఎస్ఈలో ఐటీ 1.6 శాతం జంప్‌చేయగా.. ఫార్మా ,రియల్టీ 1 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే మెటల్‌ 0.7 శాతం క్షీణించగా.. ఆటో 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ,  ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే బజాజ్‌ ఆటో 5.2 శాతం పతనంకాగా.. ఓఎన్‌జీసీ, వేదాంతా, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, యస్‌బ్యాంక్‌, హిందాల్కో, జీ, బీపీసీఎల్‌, టైటన్‌ 3-1.2 శాతం మధ్య నష్టపోయాయి.Most Popular