జేకే పేపర్‌కు ఎన్‌సీఎల్‌టీ పుష్!

జేకే పేపర్‌కు ఎన్‌సీఎల్‌టీ పుష్!

సిర్పూర్ పేపర్‌ మిల్స్‌ను సొంతం చేసుకునేందుకు వీలుగా కంపెనీ పెట్టుకున్న అభ్యర్థనను జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతించడంతో జేకే పేపర్ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం పెరిగి రూ. 102.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 105 వరకూ ఎగసింది. 
రూ. 371 కోట్లు
దివాళా చట్టం  ప్రకారం చర్యలను ఎదుర్కొంటున్న సిర్పూర్ పేపర్‌ కొనుగోలుకి వీలుగా చేసిన రిజొల్యూషన్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు  జేకే పేపర్‌ తాజాగా తెలియజేసింది. దీనిలో భాగంగా సిర్పూర్‌ పేపర్‌ రుణదాతలకు రూ. 371 కోట్లు చెల్లించనుంది. దీంతోపాటు ఇతర వ్యయాలనూ చెల్లించనున్నట్లు తెలుస్తోంది.Most Popular