HDFC AMC IPO పూర్తి వివరాలు..

HDFC AMC IPO పూర్తి వివరాలు..

వచ్చే వారం హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ (HDFC AMC) ఐపీఓకు రాబోతోంది. ఇటీవలే సెబీ నుంచి అప్రూవల్‌ రావడంతో ఐపీఓ ద్వారా రూ.2,800 కోట్ల నిధులను సమీకరించాలని HDFC AMC యోచిస్తోంది. దేశంలోనే రెండో పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అయిన HDFC AMC పబ్లిక్‌ ఇష్యూ  ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.1095-1100గా కంపెనీ నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 2.54 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.2,800 కోట్లు నిధులు సమకూరనున్నాయి. 

ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా ప్రై.లి., హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లి., ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లి., ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ లి., జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రై.లి., జేఎం ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్స్‌ ప్రై.లి., కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లి., మోర్గాన్‌ స్టాన్లే ఇండియా కంపెనీ ప్రై.లి., నోముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా)లు వ్యవహరిస్తున్నాయి. 

కంపెనీ నేపథ్యం :
1999లో ముంబాయి కేంద్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సంస్థ సేవింగ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసులను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ వెంచర్‌గా ఈ సంస్థ ప్రారంభమైంది. ఫైనాన్స్‌, హౌజింగ్‌ మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీకి చక్కని పేరుంది. అన్ని ఆస్తుల నిర్వ‌హ‌ణ‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఇన్వెస్ట‌ర్ల‌కు చాలా ఉత్ప‌త్తులు ఆఫ‌ర్ చేస్తోంది. డిసెంబ‌ర్ 31,2017 నాటికి ఈ కంపెనీ 127 ప‌థ‌కాల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. 28 ఈక్విటీ ఆధారిత‌, 91 డెట్, 3 లిక్విడ్ ప‌థ‌కాలు .. 5 ఇత‌ర ఫ‌థ‌కాలు ఈ సంస్థ నిర్వ‌హ‌ణ‌లో ఉన్నాయి. 

ఫైనాన్షియల్స్‌ :
భారత్‌లోని టాప్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో ఈ సంస్థ ఒకటి. గత ఏడాది వచ్చిన రిలయన్స్‌ నిప్పన్‌ తర్వాత ఐపీఓకు రాబోతోన్న అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఇదే. ప్రతి ఏడాది చక్కని వృద్ధితో మెరుగైన లాభాలను, ఆదాయాన్ని కంపెనీ నమోదు చేస్తోంది. గత ఐదేళ్ళ ఆదాయ వ్యయాలు, నికరలాభ వివరాలను దిగువ పట్టికలో చూడండి.


ఐపీఓ ముఖ్యాంశాలు :
ఇష్యూ ప్రారంభం : జూలై 25, 2018
ఇష్యూ ముగింపు : జూలై 27, 2018
ఇష్యూ సైజ్‌ : రూ.2,800 కోట్లు
ఫేస్‌ వాల్యూ : ఒక్కో షేరుకు రూ.5
ప్రైస్‌ బాండ్‌ : ఒక్కో షేరుకు రూ.1095-1100
రిటైల్‌ పోర్షన్‌ వాటా : 35 శాతం
మొత్తం షేర్లు :  2,54,57,555
లాట్‌ : కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాలి (రూ.14,300)
షేర్ల కేటాయింపు : ఆగస్ట్‌ 1, 2018
రీ ఫండ్‌ : ఆగస్ట్‌ 2, 2018
డీమ్యాట్‌లో షేర్ల జమ : ఆగస్ట్‌ 3, 2018
లిస్టింగ్‌ : ఆగస్ట్‌ 6, 2018 (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో)



Most Popular