హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఐపీవో@ రూ. 1100!

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఐపీవో@ రూ. 1100!

దేశంలోనే రెండో పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్‌ ఇష్యూ  ఈ నెల 25 నుంచీ ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 1,095-1,100గా కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 2.54 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 
కంపెనీ వివరాలివీ
స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో భాగస్వామ్యం ద్వారా  ప్రయివేట్‌ రంగ దిగ్గజం హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌  కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ)  ఏర్పాటు చేసిన సంస్థే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ. ఐపీవోలో భాగంగా స్టాండర్డ్‌ లైఫ్‌ 1.68 కోట్ల షేర్లను విక్రయించనుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ దాదాపు 86 లక్షల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. Most Popular