డబ్ల్యూ బ్రాండ్‌ కంపెనీ ఐపీవో నేడు!

డబ్ల్యూ బ్రాండ్‌ కంపెనీ ఐపీవో నేడు!

మహిళల దుస్తుల విభాగంలో ఇటీవల వేగవంతంగా పాప్యులారిటీని సాధించిన టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ నేటి(18) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 714-716 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1125 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. శుక్రవారం(20న) ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.57 కోట్ల షేర్లను విక్రయించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 20 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 
యాంకర్‌ పెట్టుబడులు
ఐపీవోకు ముందురోజు అంటే మంగళవారం(17న) యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ రూ. 337.5 కోట్లను సమీకరించింది. 18 యాంకర్‌ సంస్థలకు షేరుకి రూ. 716 ధరలో 47 లక్షల షేర్లకుపైగా కేటాయించింది. యాంకర్‌ సంస్థలలో గోల్డ్‌మన్‌ శాక్స్‌, ఫిడిలిటీ సెక్యూరిటీస్‌ ఫండ్‌, డీబీ ఇంటర్నేషనల్ ఏషియా, ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ తదితరాలున్నాయి.
కంపెనీ వివరాలివీ
ప్రత్యేకంగా స్త్రీల కోసం డబ్ల్యూ, ఔరేలియా, విష్‌ఫుల్‌ బ్రాండ్లతో దుస్తులనందిస్తున్న ఈ సంస్థకు భారత్‌తో పాటు విదేశాల్లో 400 ప్రత్యేక అవుట్‌లెట్లున్నాయి. అలాగే  1300 లార్జ్‌ ఫార్మెట్‌ స్టోర్‌ అవుట్‌లెట్లు, 1300 మల్టీ బ్రాండ్‌ అవుట్‌లెట్లను ఈ సంస్థ కలిగివుంది. 2001లో తొలిసారిగా W పేరుతో తొలి స్టోర్‌ను ఢిల్లీలో ప్రారంభించి అనతి కాలంలోనే దేశ, విదేశాలకు తమ అవుట్‌లెట్లను విస్తరించింది. Most Popular