ఈ మిడ్‌క్యాప్స్‌కు దూకుడెక్కువ

ఈ మిడ్‌క్యాప్స్‌కు దూకుడెక్కువ

మిడ్‌క్యాప్‌లో అమ్మకాలు సాగిన దశ నుంచి ఇప్పుడు మెల్లగా మళ్లీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీనికి గత నెల రోజులుగా పెరుగుతోన్న డెలివరీ బేస్డ్ బయింగ్ నిదర్శనం.  ఈసంస్థల కౌంటర్లలో పెరిగిన విక్రయాల సంఖ్య అందులో ట్రేడింగ్ మినహాయించి చూసినా స్టాక్స్ తమ డీమాట్ అక్కౌంట్లకి మళ్లించిన వాల్యూమ్స్ బాగా పెరిగాయి. గత మూడు నాలుగు నెలల్లో చవి చూసిన పతనం నుంచి కోలుకోవడానికి ఈ సంస్థలకు ప్రస్తుతం కాస్త మద్దతు దొరుకుతున్నట్లు కన్పిస్తోంది. ఎకనమిక్ టైమ్స్ అలాంటి వాటిలో ఓ ఐదు కంపెనీల షేర్లను ఎంచి చూసింది. అవి ఫినోలెక్స్ కేబుల్స్, గోద్రెజ్ కన్జ్యూమర్స్, ఆస్ట్రల్ పాలీటెక్నిక్, జేకె లక్ష్మి సిమెంట్స్, ఆల్‌కార్గో లాజిస్టిక్స్..ఇక ఆ షేర్లని ఎందుకు ఎలా ఎంపిక చేసిందో..ఆ వివరాలు కూడా చూద్దాం

ఫినోలెక్స్ కేబుల్స్ : CMP : 599.50 జులైలో ధరలోని మార్పు (%): 1.67
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ స్టాక్ 13శాతం పతనమైంది. కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న ఈ కేబుల్ కంపెనీ వృధ్దిని కొనసాగిస్తుందని అంచనా. దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్, బ్రాండ్ వేల్యూ కలిసి రానున్న రెండేళ్లలో 17శాతం సిఏజిఆర్ నమోదు చేయగలదని ఎడెల్వైజ్ సెక్యూరిటీస్ ఓ నివేదికలో ఇటీవలే పొందుపరిచిన విషయాన్ని ఎకనమిక్ టైమ్స్ పరిగణనలోకి తీసుకుంది.

గోద్రెజ్ కన్జ్యూమర్:  CMP: 1,307 జులైలో ధరలోని మార్పు (%): 6.20
జూన్ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటిస్తుందని గోద్రెజ్ కన్జ్యూమర్ కంపెనీపై అంచనాలు ఉన్నాయి. అందుకే భారీగా వాల్యూమ్స్ ఈ కౌంటర్‌లో చోటు చేసుకుంటున్నాయి
ఏప్రిల్-జూన్ మధ్య గృహోపకరణాలు, వాటికి వాడే క్రిమిసంహారకాల అమ్మకాల విషయంలో మంచి మార్పు కన్పిస్తుందని అంచనా. గత కొద్ది నెలలుగా ఈ అంశంలోనే గోద్రెజ్ కన్జ్యూమర్ మదనపడుతోంది. అలానే ఇండోనేషియాలోని వ్యాపారం కూడా మెరుగుపడటం కలిసి వచ్చే విషయం. జిఎస్‌టి రూపంలో సబ్బుల వ్యాపారంలోనూ కాస్త వేగం కన్పిస్తోందని ఎడెల్వైజ్ సెక్యూరిటీస్ ఇన్సిట్యూషనల్ ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రల్ పాలీ టెక్నిక్: CMP: 1,050 జులైలో ధరలోని మార్పు (%): 2.83
రెక్స్ పాలీఎక్స్ ట్రూషన్‌ అనే కంపెనీలో ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ ఇటీవలే 51శాతం వాటా కొనుగోలు చేసింది.  ఇది కేబుల్ ఛానల్ మార్కెట్‌లో భారీగా వ్యాపారం అందిపుచ్చుకునేందుకు
ఆస్ట్రల్ పాలీటెక్నిక్ సంస్థకి కలిసి వస్తుందని ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ నమ్ముతోంది. దీంతో గతంలో ఈ షేరు ధర రూ. 1137వరకూ వెళ్తుందని చెప్పిన ఇన్వెస్టెక్ ఇప్పుడు టార్గెట్ ధరని రూ. 1200కి పెంచింది.

జేకె లక్ష్మి సిమెంట్: CMP : 333.40 జులైలో ధరలోని మార్పు (%): 6.5
గత ఆరునెలల్లో బాగా పతనమైన షేరు ఇది. 30శాతానికి మించి నష్టపోయిన జెకె లక్ష్మీ సిమెంట్ కౌంటర్‌లో ప్రస్తుతం లావాదేవీలు జోరుగా సాగుతున్నాయ్.ఇండ్‌సెక్ సెక్యూరిటీస్ ఈ షేరుపై సానుకూల థృక్ఫథంతో ఉంది. తూర్పుప్రాంతంలో మంచి రియలైజేషన్స్ సాధిస్తోన్న జేకె లక్ష్మి సిమెంట్, త్వరలోనే ఉత్తరభారతదేశంలోనూ ఇదే బాట పట్టనుందని అంచనా వేసింది.

ఆల్‌కార్గో లాజిస్టిక్స్ :  CMP: 112.85 , జులైలో ధరలోని మార్పు (%): 4.45
ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌లో ప్రమోటర్ వాటా పెంచుకోవడం ఇటీవల జరిగిన గమనించదగ్గ మార్పు. వేల్యుయేషన్స్ చూస్తే, 2019 సంవత్సరానికి 13.4రెట్లు, 2020 సంవత్సరానికి 10.3రెట్లుగా ఆల్‌కార్గో లాజిస్టిక్స్ షేరు ట్రేడవుతోంది. ఇది ఆకర్షణీయమైన విషయంగా మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో పేర్కొంది. కాంపౌండ్ యాన్యువల్ ఆగ్రిగేట్ రేటు -సిఏజీఆర్‌లో 27శాతం వృధ్ది నమోదు అవుతుందని చెప్పింది. దీంతో ప్రస్తుతం ఉన్న రేటు నుంచి రానున్న కాలంలో రూ. 163కి షేరు పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేస్తోంది.

కింది ఫోటోలో ఇన్వెస్టర్లు గత నాలుగు నెలల్లో ఈ స్టాక్స్‌లో తీసుకున్న డెలివరీ శాతం చూడవచ్చుMost Popular