ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌.. పబ్లిక్‌ ఇష్యూ!

ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌.. పబ్లిక్‌ ఇష్యూ!

డ్యూటీ ఫ్రీ, ట్రావెల్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతిని ఈ నెల మొదట్లో పొందింది. ఐపీవోకు అనుమతించమంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీకి దరఖాస్తు చేసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 2,600 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్‌లో భాగంగా రూ. 2423 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 11.29 లక్షల షేర్లను అనుబంధ సంస్థ ఫ్లెమింగో డ్యూటీ ఫ్రీ షాప్‌ ముంబై విక్రయించనుంది. 
కంపెనీ వివరాలివీ
దుబాయ్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఫ్లెమింగో ట్రావెల్‌ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో డ్యూటీ ఫ్రీ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇండియా, శ్రీలంకలలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. 2017 సెప్టెంబర్‌కల్లా 11 అంతర్జాతీయ విమానాశ్రయాలలో 28 డ్యూటీ ఫ్రీ స్టోర్లను నిర్వహిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లతోపాటు.. క్రూయిజ్‌ లైన్స్‌, విమానాలు, సీపోర్టులలోనూ వస్తువుల విక్రయాలు చేపడుతున్నట్లు పేర్కొంది. మద్యం, వాచీలు, ఆభరణాలు, కాస్మెటిక్స్‌ తదితర ప్రొడక్టులను విక్రయిస్తుంటుంది. 2017 మార్చికల్లా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన దాదాపు రూ. 600 కోట్ల ఆదాయం సాధించింది. అయితే  రూ. 114 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు తెలియజేసింది.Most Popular