సరికొత్త మొబైల్ స్టోర్ కాన్సెప్ట్‌తో సెలెక్ట్.. బ్రాండ్ ఎంబాసిడర్‌గా ఎన్టీఆర్

సరికొత్త మొబైల్ స్టోర్ కాన్సెప్ట్‌తో సెలెక్ట్.. బ్రాండ్ ఎంబాసిడర్‌గా ఎన్టీఆర్

మొబైల్ స్టోర్స్‌తో సరికొత్త విప్లవానికి తెరతీయబోతోంది సెలెక్ట్. కస్టమర్లకు లేటెస్ట్ బయింగ్ ఎక్స్‌పీరియన్స్‌‌ను అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ స్టోర్లకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కావాలనుకున్న మొబైల్ బ్రాండ్‌‌కు సంబంధించిన వివరాలన్నీ ఎల్ఈడీలో డిస్‌ప్లే అవుతాయని, దీంతో సేల్స్‌మెన్‌ ప్రభావానికి లోనుకాకుండా మొబైల్ కొనచ్చనేది వీళ్ల కాన్సెప్ట్. ఏడాదిలో 200 స్టోర్లు, మూడేళ్లలో దేశవ్యాప్తంగా 500 స్టోర్ల ఏర్పాటే లక్ష్యమని తెలిపారు సెలెక్ట్ స్టోర్స్ ఫౌండర్ గురు. మొదటి ఏడాదిలో 800 కోట్ల రూపాయల టర్నోవర్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు. మూడేళ్లలో మొత్తం రూ.2500 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తామని.. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. 

మొదటి దశలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో 200 స్టోర్లు, రెండో ఏడాది మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో స్టోర్లను నెలకొల్పబోతోంది సెలెక్ట్ మొబైల్ స్టోర్. ఈ నెల 20 నుంచి స్టోర్లు పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి రాబోతున్నాయి. Most Popular