ఎక్స్‌బోనస్‌లోనూ అశోకా బిల్డ్‌కాన్‌ జోరు!

ఎక్స్‌బోనస్‌లోనూ అశోకా బిల్డ్‌కాన్‌ జోరు!

మౌలిక సదుపాయాల సంస్థ అశోకా బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ ఎక్స్‌బోనస్‌లోనూ జోరు చూపుతోంది. ఎన్‌ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 189ను తాకింది. తదుపరి వెనక్కి తగ్గింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 165 వద్ద ట్రేడవుతోంది. వాటాదారులకు 1:2 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి రికార్డ్‌ డేట్‌ ముగియడంతో ఈ కౌంటర్‌ నేటి నుంచి ఎక్స్‌బోనస్‌కు చేరింది. బోనస్‌లో భాగంగా వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 2 షేర్లకూ 1 షేరుని జారీ చేయనుంది. ముంబైకి చెందిన అశోకా బిల్డ్‌కాన్‌ ఈపీసీ, బీవోటీ పద్ధతిలో జాతీయ రహదారుల అభివృద్ధిని చేపడుతుంటుంది. Most Popular