ఆటో, ఐటీ వెనకడుగు- ఆర్‌ఐఎల్‌ దూకుడు!

ఆటో, ఐటీ వెనకడుగు- ఆర్‌ఐఎల్‌ దూకుడు!

ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ క్వాడ్రపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,699 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 325 పాయింట్లు జంప్‌చేసి 36,591కు చేరగా..  నిఫ్టీ 79 పాయింట్లు ఎగసి 11,027 వద్ద ట్రేడవుతోంది. 
ఆర్‌ఐఎల్‌ రికార్డ్‌
ఎన్‌ఎస్ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం లాభపడగా... మీడియా, రియల్టీ, ఆటో అదే స్థాయిలో వెనకడుగు వేశాయి. ఐటీ 0.5 శాతం క్షీణించగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం.. ముకేశ్‌ అంబానీ సంస్థ ఆర్‌ఐఎల్‌ 5 శాతం జంప్‌చేసింది. రూ. 1099 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 6.93 లక్షల కోట్లను అధిగమించింది.
ఎఫ్‌అండ్‌వో ఇలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో బలరామ్‌పూర్‌, గ్యామన్‌ ఇన్‌ఫ్రా, ఎంఆర్‌పీఎల్‌, ఇండియా సిమెంట్స్‌, బీపీసీఎల్‌, అరవింద్, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండిగో, బజాజ్‌ ఫైనాన్స్‌ 7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు అదానీ పవర్‌, పీసీ జ్యువెలర్స్‌, ఐఆర్‌బీ, స్టార్‌, మణప్పురం, టీవీ 18, యూపీఎల్‌, బజాజ్‌ ఆటో, పీఎఫ్‌సీ, బీఈఎంఎల్‌ 7-2.5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular