అదానీ పవర్‌కు బ్లాక్‌డీల్‌ షాక్‌!

అదానీ పవర్‌కు బ్లాక్‌డీల్‌ షాక్‌!

బ్లాక్‌డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో అదానీ పవర్‌ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 7 శాతం పతనమైంది. రూ. 19 వద్ద ట్రేడవుతోంది. బ్లాక్‌డీల్‌ ద్వారా 1.43 మిలియన్‌ షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా తెలియజేస్తోంది. అయితే డీల్‌ వివరాలు వెల్లడికావలసి ఉంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular