కోలుకున్న యూరప్‌ మార్కెట్లు- స్కై అప్‌!

కోలుకున్న యూరప్‌ మార్కెట్లు- స్కై అప్‌!

అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాదాలతో బుధవారం నష్టపోయిన యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఫుట్సీ 0.5 శాతం పుంజుకోగా, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.25 శాతం చొప్పున బలపడ్డాయి. ఇక ఆసియాలోనూ మార్కెట్లు బౌన్స్‌ అయ్యాయి. చైనా 2 శాతం, జపా 1.2 శాతం చొప్పున జంప్‌చేయగా.. మిగిలిన మార్కెట్లన్నీ లాభాలతో ముగిశాయి. 
జెర్రిషీమర్‌ జోష్‌
గైడెన్స్‌ ఆకట్టుకోవడంతో జెర్రిషీమర్‌ 6 శాతం జంప్‌చేసింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో మోలర్‌ మార్స్క్‌ 3 శాతం ఎగసింది. కంపెనీ కొనుగోలుకి కామ్‌కాస్ట్‌ ఆఫర్‌ను పెంచడంతో స్కై దాదాపు 3 శాతం పెరిగింది. స్కై కొనుగోలుకి ట్వీంటీ ఫస్ట్‌ సెంచరీ ఫాక్స్‌ సైతం పోటీపడుతున్న విషయం విదితమే. కాగా.. రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశ పరచడంతో డీఎన్‌బీ ఏఎస్‌ఏ 5 శాతం పతనమైంది. Most Popular