మలేరియా ఔషధం- డాక్టర్‌ రెడ్డీస్‌కు ప్లస్‌

మలేరియా ఔషధం- డాక్టర్‌ రెడ్డీస్‌కు ప్లస్‌

దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా వ్యాధి చికిత్సకు వినియోగించగల ప్లేక్వెనిల్ జనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం ఎగసి రూ. 2365 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2388 వరకూ జంప్‌చేసింది. 
200 ఎంజీ డోసేజీ
హైడ్రాక్సిక్లోరోక్విన్‌ సల్ఫేట్‌ ట్యాబ్లెట్ల(ప్లేక్వెనిల్‌)ను 200 ఎంజీ డోసేజీలో యూఎస్‌ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. ఈ ఔషధానికి 21.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1400 కోట్లు) మార్కెట్‌ ఉన్నట్లు తెలియజేసింది. కాగా.. యూకేలో డాక్టర్‌ రెడ్డీస్‌ సుబోక్జోన్‌ ఔషధ జనరిక్‌ను విడుదల చేయడంతో అక్కడి ఫార్మా కంపెనీ ఇండివియర్‌ లాభాలు తగ్గనున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం విదితమే.Most Popular