జోరుగా హుషారుగా- సరికొత్త రికార్డులు!

జోరుగా హుషారుగా- సరికొత్త రికార్డులు!

ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపిస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ క్వాడ్రపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,699 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 383 పాయింట్లు జంప్‌చేసి 36,649కు చేరగా..  నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 11,063 వద్ద ట్రేడవుతోంది. 
ఆర్‌ఐఎల్‌ రికార్డ్‌
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా... ఐటీ 0.5 శాతం వెనకడుగు వేసింది. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, మెటల్‌ 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌ 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 1099 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అంతేకాకుండా 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించింది. కాగా.. మిగిలిన బ్లూచిప్స్‌లో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఆటో, హీరోమోటో, ఎంఅండ్ఎం, టెక్‌ మహీంద్రా, వేదాంతా, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్  2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. Most Popular