ఎంఎం ఫోర్జింగ్స్‌కు బోనస్‌ బలిమి 

ఎంఎం ఫోర్జింగ్స్‌కు బోనస్‌ బలిమి 

వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ఎంఎం ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 1456 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1473 వరకూ ఎగసింది.
ఇతర వివరాలివీ
బోనస్‌లో భాగంగా వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకీ మరో షేరుని ఫ్రీగా జారీ చేసేందుకు బుధవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు ఎంఎం ఫోర్జింగ్స్‌ పేర్కొంది. అంతేకాకుండా రుణ సమీకరణ పరిమితిని రూ. 500 కోట్ల నుంచి రూ. 1500 కోట్లకు పెంచేందుకు అనుమతించినట్లు తెలియజేసింది. రానున్న రెండేళ్లలో విస్తరణపై రూ. 650 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది.Most Popular