రి'లయన్స్‌' ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్‌!

రి'లయన్స్‌' ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్‌!

ప్రయివేట్‌ రంగ ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేరు సరికొత్త రికార్డును సాధించింది. దేశీ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో తొలిసారి 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది. షేరు ధర ఆధారంగా లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ) ప్రస్తుతం రూ. 6,86,327 కోట్లను అధిగమించింది. బీఎస్ఈలో ప్రస్తుతం రిలయన్స్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 1083 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1090 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. 
టీసీఎస్ తొలిసారి
ఇప్పటికే టాటా గ్రూప్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ రీత్యా 100 బిలియన్‌ డాలర్లను అందుకున్న తొలి దేశీ కంపెనీగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత కొంతకాలంగా ఇంధన బిజినెస్‌కుతోడు రిటైల్‌, మొబైల్‌(జియో) రంగాలలోనూ చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తుండటం షేరు జోరుకు కారణంకావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. గతంలో అంటే 2007 అక్టోబర్‌లో డాలరుతో రూపాయి మారకపు విలువ 39.5 స్థాయిలో ఉన్నపుడు కూడా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ. 4 లక్షల కోట్లను అధిగమించడం విశేషం!Most Popular