సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ- నిఫ్టీ సెంచరీ!

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ- నిఫ్టీ సెంచరీ!

ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,612 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 342 పాయింట్లు జంప్‌చేసి 36,608కు చేరగా..  నిఫ్టీ 107 పాయింట్లు ఎగసి 11,055 వద్ద ట్రేడవుతోంది. 

ఐటీ వెనకడుగు
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా... ఐటీ నామమాత్రంగా 0.2 శాతం నీరసించింది. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, మెటల్‌, ఫార్మా, రంగాలు 1.2 శాతం స్థాయిలో ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోబీ, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, అలహాబాద్‌, కెనరా, బీవోఐ, యూబీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌ 3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. 
మెటల్‌ షేర్లలో జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ, హిందాల్కో, జిందాల్‌ స్టెయిన్‌, టాటా స్టీల్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా, హింద్‌ కాపర్‌, నాల్కో, హింద్‌ జింక్‌ 4-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇక ఫార్మా కౌంటర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, పిరమల్‌, సన్‌ ఫార్మా, అరబిందో 2.8-0.7 శాతం మధ్య బలపడ్డాయి. ఇతర నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పీసీఎల్‌, బీసీఎల్‌, యస్‌బ్యాంక్‌, ఐవోసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ 4-2.3 శాతం మధ్య పెరిగాయి. అయితే మరోపక్క ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, జీ, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఎంఅండ్ఎం 1.8-0.5 శాతం మధ్య నష్టపోయాయి. Most Popular