ఎంఆర్‌వో టెక్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ దన్ను!

ఎంఆర్‌వో టెక్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ దన్ను!

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్‌ఎల్‌ నుంచి కాంట్రాక్టు పొందినట్లు వెల్లడికావడంతో ఎంఆర్‌వోటెక్‌ రియల్టీ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46 సమీపంలో ఫ్రీజయ్యింది.  ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ కోసం బీఎస్ఎన్‌ఎల్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేటర్‌ భాగస్వామిగా ఎంపిక చేసుకున్నట్లు ఎంఆర్‌వో టెక్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్ జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు.Most Popular