కాంట్రాక్ట్‌తో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ అప్‌

కాంట్రాక్ట్‌తో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ అప్‌

అనుబంధ మెటీరియల్‌ సంస్థ కాఫీడే గ్లోబల్‌(సీడీజీఎల్‌) ఉబర్‌ పోర్టియర్‌ బీవీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొనడంతో  కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.2 శాతం పెరిగి రూ. 271 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 272 వరకూ ఎగసింది.
టైఅప్‌
ఒప్పందంలో భాగంగా ఉబర్‌ ఈట్స్‌ మొబైల్‌ అప్లికేషన్‌ నుంచి టెక్నాలజీ సర్వీసులను అందుకోనున్నట్లు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. తద్వారా ఫుడ్‌ ప్రొడక్టుల పంపిణీని విస్తరించనున్నట్లు వివరించింది. దీంతో రిటైల్‌ అమ్మకాలు ఊపందుకునే వీలున్నట్లు కాఫీ డే పేర్కొంది. ఐదేళ్లకు కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 



Most Popular