మార్కెట్ల దూకుడు- చిన్న షేర్లకు జోష్‌!

మార్కెట్ల దూకుడు- చిన్న షేర్లకు జోష్‌!

నిరుత్సాహకర విదేశీ సంకేతాల నేపథ్యంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,545 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 271 పాయింట్లు జంప్‌చేసి 36,537 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 81 పాయింట్లు ఎగసి 11,030కు చేరింది. తద్వారా 11,000 పాయింట్ల మార్క్‌ను మరోసారి అధిగమించింది. మార్కెట్ల ప్రోత్సాహంతో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. దీంతో బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.7 శాతం చొప్పున బలపడ్డాయి.
లాభాల బాటలో
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1342 లాభపడితే.. 605 మాత్రమే నీరసంగా కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఎంఆర్‌పీఎల్‌, జిందాల్‌ స్టీల్‌, ఎంఫసిస్‌, ఎంఆర్‌ఎఫ్‌, మ్యాక్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అశోక్‌ లేలాండ్‌, అజంతా ఫార్మా, అపోలో హాస్పిటల్స్‌, గృహ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ తదితరాలు 3-2 శాతం మధ్య లాభపడ్డాయి.
స్మాల్‌ క్యాప్స్‌లోనూ బోరోసిల్‌, టైమ్‌టెక్నో, క్యుపిడ్‌, సొనాటా, కేసర్‌ టెర్మినల్‌, గేట్‌వే, అశోకా బిల్డ్‌, యారో గ్రీన్‌, జీవీకే, రుచీ సోయా, మోనెట్‌ ఇస్పాత్‌, మిర్క్‌, నాథ్‌ బయో, సెంచురీ ఎంకా, జెట్‌ ఎయిర్‌వేస్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ 8-4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular