ధరల పతనం- చమురు షేర్లకు కిక్‌!

ధరల పతనం- చమురు షేర్లకు కిక్‌!

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కుప్పకూలడంతో దేశీయంగా పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలకు జోష్‌వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్‌ 3.8 శాతం జంప్‌చేసి రూ. 380 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 386ను తాకింది.
జీఆర్‌ఎం మెరుగు
ఐవోసీ ప్రస్తుతం 3.6 శాతం పెరిగి రూ. 160 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 164 వరకూ ఎగసింది. ఇక హెచ్‌పీసీఎల్‌ సైతం 3.5 శాతం పుంజుకుని రూ. 274 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 282కు చేరింది. ముడిచమురు ధరలు క్షీణిస్తే పెట్రో ఉత్పత్తి సంస్థల స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) మెరుగుపడే సంగతి తెలిసిందే.Most Popular