చైనా, జపాన్‌ అప్‌- ఆసియా మార్కెట్లు ప్లస్‌!

చైనా, జపాన్‌ అప్‌- ఆసియా మార్కెట్లు ప్లస్‌!

వాణిజ్య వివాదాలు ముదురుతున్నప్పటికీ ఆసియా స్టాక్‌ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇప్పటికే అమెరికా చైనా మధ్య 34 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై టారిఫ్‌ల వడ్డింపు అమలవుతుండగా.. అమెరికా ప్రభుత్వం మరో 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై సుంకాలను విధించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు తగిన విధంగా సమాధానమివ్వనున్నట్లు చైనా ప్రభుత్వం సైతం స్పందించింది. దీంతో తిరిగి వాణిజ్య వివాద ఆందోళనలు తలెత్తినప్పటికీ ఆసియా మార్కెట్లు జోరందుకోవడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు చెబుతున్నారు.

జోరుగా
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా దాదాపు 2 శాతం జంప్‌చేయగా.. జపాన్‌ 1.3 శాతం ఎగసింది. మిగిలిన మార్కెట్లలో హాంకాంగ్‌, దక్షిణ కొరియా, ఇండోనేసియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌ 0.7-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి.  సింగపూర్‌ స్వల్పంగా 0.1 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94.70కు బలపడగా.. జపనీస్‌ యెన్‌ 112కు బలహీనపడింది. ఇది ఆరు నెలల కనిష్టంకాగా.. యూరో 1.167కు చేరింది.Most Popular