సెన్సెక్స్‌ సరికొత్త రికార్డ్‌- నిఫ్టీ @11,000!

సెన్సెక్స్‌ సరికొత్త రికార్డ్‌- నిఫ్టీ @11,000!

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు అమెరికా, చైనా వాణిజ్య వివాదాలతో సతమతమవుతున్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరుగా సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో వరుసగా నాలుగో రోజు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 36,513కు ఎగసింది. తద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇంతక్రితం నమోదైన 36,444 పాయింట్ల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం 244 పాయింట్లు జంప్‌చేసి 36,510 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 11,025కు చేరింది. వెరసి 11,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, ఆటో, మెటల్‌ 1-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యస్‌బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, మారుతీ 5-1.2 శాతం మధ్య పెరిగాయి. కేవలం ఇన్‌ఫ్రాటెల్‌ 2.5 శాతం పతనమైంది.  ఈ బాటలో టీసీఎస్, అదానీ పోర్ట్స్‌ స్వల్పంగా 0.4 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');