యూఎస్‌ మార్కెట్లకు టారిఫ్‌ వార్‌ దెబ్బ!

యూఎస్‌ మార్కెట్లకు టారిఫ్‌ వార్‌ దెబ్బ!

అటు చైనాతో వాణిజ్య వివాదాలు, ఇటు చమురు ధరల పతనం నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 219 పాయింట్లు(0.9 శాతం) పతనమై 24,700 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 20 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 2,774 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 43 పాయింట్లు(0.55  శాతం) నీరసించి 7,717 వద్ద ముగిసింది. ఉన్నట్టుండి పతనమైన చమురు ధరల కారణంగా ఇంధన దిగ్గజాలలో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. దీనికితోడు 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై 10 శాతం సుంకాలను విధించనున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు తగిన విధంగా స్పందిస్తామంటూ చైనా సమాధానమివ్వడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనైనట్లు తెలియజేశారు.

బ్లూచిప్స్‌ వీక్‌
బ్లూచిప్‌ కంపెనీలు బోయింగ్‌, 3ఎం, కేటర్‌పిల్లర్‌ అమ్మకాలతో నీరసించడంతో మార్కెట్లు నష్టపోయాయి. కాపర్‌ ధరలు క్షీణించడంతో ఫ్రీపోర్ట్‌ మెక్‌మోరాన్‌ 4 శాతం పతనమైంది. బ్రిటిష్‌ కంపెనీ స్కై కొనుగోలుకి ఆఫర్‌ను పెంచడంతో ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఫాక్స్‌ 4 శాతం వెనకడుగువేసింది. అయితే ప్రత్యర్థి సంస్థ కామ్‌కాస్ట్‌ 1.3 శాతం బలపడింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');