నేడు కాఫీడే షేరు ఘుమఘుమలు?

నేడు కాఫీడే షేరు ఘుమఘుమలు?

అనుబంధ మెటీరియల్‌ సంస్థ కాఫీడే గ్లోబల్‌(సీడీజీఎల్‌) ఉబర్‌ పోర్టియర్‌ బీవీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. దీనిలో భాగంగా ఉబర్‌ ఈట్స్‌ మొబైల్‌ అప్లికేషన్‌ నుంచి టెక్నాలజీ సర్వీసులను అందుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఫుడ్‌ ప్రొడక్టుల పంపిణీని విస్తరించనున్నట్లు వివరించింది. దీంతో రిటైల్‌ అమ్మకాలు ఊపందుకునే వీలున్నట్లు కాఫీ డే పేర్కొంది. ఐదేళ్లకు కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఫలితంగా నేడు కాఫీ డే ఎంటర్‌ప్రైజస్‌ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.2 శాతం బలపడి రూ. 265 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 268 వద్ద గరిష్టాన్ని, రూ. 262 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular