2 రోజుల ర్యాలీకి బ్రేక్‌- ఫ్లాట్‌ ముగింపు!

2 రోజుల ర్యాలీకి బ్రేక్‌- ఫ్లాట్‌ ముగింపు!

రెండు రోజుల ర్యాలీ తరువాత దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఇప్పటికే ముదిరిన వాణిజ్య వివాదాలకు ఆజ్యంపోస్తూ అమెరికా మరో 200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో ఆసియా, యూరప్‌ మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడాయి. చివరికి అక్కడక్కడే అన్నట్టుగా ముగిశాయి. సెన్సెక్స్‌  26 పాయింట్ల స్వల్ప లాభంతో 36,266 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 1 పాయింట్ బలపడి 10,948 వద్ద స్థిరపడింది. 
ఐటీ హవా- మెటల్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ ఇండెక్స్‌ 3.2 శాతం పతనంకాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం, ఆటో 1 శాతం క్షీణించాయి. ఐటీ 2.3 శాతం జంప్‌చేసింది. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌ 5.3 శాతం దూసుకెళ్లగా.. ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌యూఎల్‌, ఆర్‌ఐఎల్‌, ఇన్ఫోసిస్‌, కొటక్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్‌ 3-0.8 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు యూపీఎల్‌ 5.4 శాతం కుప్పకూలగా, కోల్‌ ఇండియా, హిందాల్కో, వేదాంతా, టాటా మోటార్స్‌, టైటన్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ 4.7-1.7 శాతం మధ్య పతనమయ్యాయి.
చిన్న షేర్లు వీక్‌
ఒడిదొడుకుల మార్కెట్లో చిన్న షేర్లు బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.7 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.35 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1563 నష్టపోగా.. 1057 లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐలు సైలెంట్‌
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం సైలెంట్‌ అయ్యారు. కేవలం రూ. 21 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఎఫ్‌పీఐలు సోమవారం రూ. 570 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా .. సోమవారం రూ. 740 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం మరోసారి రూ. 294 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');