అదానీ గ్రూప్‌ షేర్ల కళకళ!

అదానీ గ్రూప్‌ షేర్ల కళకళ!

సిటీ గ్యాస్‌ రిటైలింగ్‌ పంపిణీ లైసెన్సుల వేలంలో అదానీ గ్రూప్‌ టాప్‌ బిడ్డర్‌గా నిలిచినట్లు వెలువడ్డ వార్తలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో గ్రూప్‌లోని దాదాపు అన్ని షేర్లకూ డిమాండ్‌ పుట్టింది. మొత్తం 52 పట్టణాలలో గ్యాస్‌ రిటైలింగ్‌ లైసెన్సులకు అదానీ గ్రూప్‌ ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. అదానీ గ్యాస్‌ సొంతంగా 32 పట్టణాలకు, ఐవోసీతో భాగస్వామ్యం ద్వారా మరో 20 పట్టణాలకు బిడ్‌ వేసినట్లు తెలుస్తోంది.  
షేర్ల జోరు
అదానీ గ్రూప్‌ షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తున్నాయి. ప్రధానంగా అదానీ పవర్‌ 14.4 శాతం దూసుకెళ్లి రూ. 20ను తాకగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.2 శాతం జంప్‌చేసి రూ. 124కు చేరింది. ఈ బాటలో అదానీ ట్రాన్స్‌మిషన్‌ 3.2 శాతం ఎగసి రూ. 166 వద్ద, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2 శాతం పెరిగి రూ. 32 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా అదానీ పోర్ట్స్‌ 1 శాతం బలపడి రూ. 375 వద్ద కదులుతోంది.Most Popular