కాంట్రాక్ట్‌తో రామ్‌కో సిస్టమ్స్‌కు రెక్కలు

కాంట్రాక్ట్‌తో రామ్‌కో సిస్టమ్స్‌కు రెక్కలు

హాంకాంగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ నుంచి కాంట్రాక్ట్ లభించినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల దేశీ సంస్థ రామ్‌కో సిస్టమ్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 380 వరకూ ఎగసింది. విమానాల నిర్వహణ, మరమ్తతుల సంస్థ హెచ్‌ఈఈసీవో నుంచి ఏవియేషన్‌ సూట్‌ కోసం కాంట్రాక్టు లభించినట్లు రామ్‌కో సిస్టమ్స్‌ పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా ఇన్వెంటరీ టెక్నికల్‌ మేనేజ్‌మెంట్‌, సప్లై చైన్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర ఎండ్‌టుఎండ్‌ సొల్యూషన్స్ అందించనున్నట్లు వివరించింది.Most Popular