ఐటీ హైజంప్‌- మెటల్‌, బ్యాంక్స్‌ పతనం!

ఐటీ హైజంప్‌- మెటల్‌, బ్యాంక్స్‌ పతనం!

వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ మార్కెట్లు నీరసించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ఎదురీదుతున్నాయి. కన్సాలిడేషన్‌ మధ్య లాభాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 75 పాయింట్లు ఎగసి 36,314కు చేరగా... నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప లాభంతో 10,959 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ ఇండెక్స్‌ 3.3 శాతం పతనంకాగా.. ఐటీ 2.7 శాతం ఎగసింది. కాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ సైతం దాదాపు 2 శాతం క్షీణించింది.
టీసీఎస్‌ జోరు
ఐటీ కౌంటర్లలో టీసీఎస్‌ 6 శాతంపైగా జంప్‌చేసి కొత్త గరిష్టాన్ని తాకగా.. టాటా ఎలక్సీ, ఇన్ఫోసిస్‌, మైండ్‌ట్రీ, కేపీఐటీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో  4.4-1 శాతం మధ్య పెరిగాయి.
చైనీస్‌ ఎఫెక్ట్‌
అమెరికా- చైనా టారిఫ్‌ల వివాదం కారణంగా మెటల్ ధరలు పతనంకావడంతో మెటల్‌ రంగ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. మెటల్‌ స్టాక్స్‌లో కోల్‌ ఇండియా, సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, వేదాంతా, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, హిందాల్కో, హింద్‌ జింక్‌, నాల్కో, వెల్‌స్పన్‌, టాటా స్టీల్‌, హింద్‌ కాపర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంవోఐఎల్‌, ఎన్‌ఎండీసీ 5-1.5 శాతం మధ్య పతనమయ్యాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, ఓబీసీ, యూబీఐ, బీవోబీ, పీఎన్‌బీ, సిండికేట్‌, అలహాబాద్‌, ఇండియన్‌,, కెనరా బ్యాంకు, ఎస్‌బీఐ 4.2-1.5 శాతం మధ్య క్షీణించాయి.



Most Popular