కొత్త మోడళ్లతో మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌కు కిక్‌

కొత్త మోడళ్లతో మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌కు కిక్‌

వాషింగ్‌ మెషీన్ల విభాగంలో సరికొత్త మోడళ్లను విడుదల చేసినట్లు వెల్లడించడంతో మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 31.75 వద్ద ఫ్రీజయ్యింది.  ప్రస్తుతం దాదాపు 4 శాతం లాభపడి రూ. 31.40 వద్ద ట్రేడవుతోంది. తాజాగా వాషింగ్‌ మెషీన్ల విభాగంలో ఒనిడా బ్రాండుతో 20 రకాల కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు మిర్క్‌ తెలియజేసింది. తద్వారా ఈ విభాగం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 160 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తున్నట్లు తెలియజేసింది. Most Popular