యూరప్‌ మార్కెట్లు వీక్‌- ఇండివియర్‌ పతనం!

యూరప్‌ మార్కెట్లు వీక్‌- ఇండివియర్‌ పతనం!

సుమారు 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైతిజర్‌ తాజాగా పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. ఇప్పటికే వాణిజ్య వివాదాల కారణంగా ఆసియాలో అమ్మకాలు ఊపందుకోగా.. యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సైతం బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఆపైమరింత నీరసించాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఫుట్సీ, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 1.4 శాతం చొప్పున పతనంకాగా..  ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ సైతం 1.2 శాతం క్షీణతతో ట్రేడవుతోంది. ఇక ఆసియాలోనూ చైనా, జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, తైవాన్‌, దక్షిణ కొరియా 2-0.6 శాతం మధ్య క్షీణించాయి.

కుప్పకూలిన ఇండివియర్‌
ఇకపై ఫలితాలు నిరాశపరచనున్నట్లు గైడెన్స్‌ ప్రకటించడంతో ఇండివియర్‌ షేరు 32 శాతం కుప్పకూలింది. ఈ బాటలో యథాతథ అంచనాలు ప్రకటించిన బర్‌బెర్రీ సైతం 4 శాతం పతనమైంది. మరోవైపు యూకే గృహ రంగ సంస్థ బరాట్‌ డెవలప్‌మెంట్స్‌, లాగార్డీరె 2.3 శాతం చొప్పున బలపడ్డాయి. కాగా..  మార్టిన్‌ స్కిలునాను కొత్త చైర్మన్‌గా సెయిన్స్‌బరీ ఎంపిక చేసుకోనున్నట్లు స్కై న్యూస్‌ పేర్కొంది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');