రైట్స్‌తో షాలిమార్‌కు లాభాల కలర్స్‌ 

రైట్స్‌తో షాలిమార్‌కు లాభాల కలర్స్‌ 

రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరించేందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో షాలిమార్‌ పెయింట్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 142 వరకూ ఎగసింది. రైట్స్‌ ఇష్యూ చేపట్టడం ద్వారా రూ. 240 కోట్లకు మించకుండా నిధులు సమీకరించేందుకు మంగళవారం సమావేశమైన బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు షాలిమార్‌ పెయింట్స్‌ తాజాగా వెల్లడించింది. Most Popular