ఏఎస్‌ఎం టెక్నాలజీస్‌ చేతికి ఆర్‌వీ ఫామ్స్‌!

ఏఎస్‌ఎం టెక్నాలజీస్‌ చేతికి ఆర్‌వీ ఫామ్స్‌!

చెన్నై సంస్థ ఆర్‌వీ ఫామ్స్‌ అండ్‌ గేర్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొనడంతో ఏఎస్‌ఎం టెక్నాలజీస్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత బీఎస్ఈలో ఈ షేరు 3.4 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 108 వద్ద ఫ్రీజయ్యింది. ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ. 105 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌వీ ఫామ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఏఎస్‌ఎం టెక్నాలజీస్‌ తెలియజేసింది.Most Popular