మార్కెట్‌ ఫ్లాట్‌- మెటల్‌, ప్రభుత్వ బ్యాంక్స్‌ బోర్లా!

మార్కెట్‌ ఫ్లాట్‌- మెటల్‌, ప్రభుత్వ బ్యాంక్స్‌ బోర్లా!

రెండు రోజులు లాభాల దౌడు తీసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 13 పాయింట్ల స్వల్ప లాభంతో 36,253కు చేరగా... నిఫ్టీ దాదాపు యథాతథంగా 10,947 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం పతనమైంది. ఈ బాటలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం డీలాపడగా.. ఐటీ 1.7 శాతం ఎగసింది.
చైనీస్‌ ఎఫెక్ట్‌
అమెరికా- చైనా టారిఫ్‌ల వివాదం కారణంగా మెటల్ ధరలు పతనంకావడంతో మెటల్‌ రంగ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. మెటల్‌ స్టాక్స్‌లో జిందాల్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, వేదాంతా, హింద్‌ జింక్‌, నాల్కో, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, ఎంవోఐఎల్‌, వెల్‌స్పన్‌, టాటా స్టీల్‌, హింద్‌ కాపర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి.
పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ, యూబీఐ, ఆంధ్రా బ్యాంక్‌, ఇండియన్‌, అలహాబాద్‌, సిండికేట్‌ బ్యాంకులతోపాటు పీఎన్‌బీ, కెనరా, బీవోబీ, ఎస్‌బీఐ 4-2 శాతం మధ్య క్షీణించాయి.
టీసీఎస్‌ జోరు
ఐటీ కౌంటర్లలో టీసీఎస్‌ దాదాపు 4 శాతం జంప్‌చేయగా.. టాటా ఎలక్సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, కేపీఐటీ, విప్రో, ఇన్ఫోసిస్‌ 2-0.7 శాతం మధ్య ఎగశాయి.Most Popular