నష్టాలలోకి మార్కెట్లు- చిన్న షేర్లు డౌన్‌

నష్టాలలోకి మార్కెట్లు- చిన్న షేర్లు డౌన్‌

వాణిజ్య వివాద ఆందోళనల నడుమ నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకులతో సాగుతున్నాయి. లాభనష్టాలకు లోనవుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 36 పాయింట్లు క్షీణించి 36,210కు చేరగా... నిఫ్టీ 10 పాయింట్లు తక్కువగా 10,937 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో బీఎస్ఈలో ప్రస్తుతం మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.65 శాతం క్షీణించగా... స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం వెనకడుగు వేసింది. 
నష్టపోయినవే ఎక్కువ
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1264 నష్టపోగా.. 969 లాభాలతో ట్రేడవుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో రామ్‌కో సిమెంట్స్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, బ్యాంక్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, ఆర్‌కామ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, నాల్కో, బీఈఎల్‌, ఎంఆర్‌పీఎల్‌, చోళమండలం, టాటా గ్లోబల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ తదితరాలు 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. 
స్మాల్‌ క్యాప్స్‌లోనూ అలంకిత్‌, ఇంట్రాసాఫ్ట్‌, వీమార్ట్‌, మన్‌పసంద్‌, రామ్‌కీ, ఎన్‌డీటీవీ, జేబీఎఫ్‌, రామా న్యూస్‌, ఐటీడీసీ, శ్రీకాళహస్తి, పెన్నార్‌, తిరుమలై కెమ్‌, టేక్‌, భూషణ్‌, పవర్‌మెక్‌, ద బైక్‌, ఎక్సెల్‌ తదితరాలు 6-4 శాతం మధ్య తిరోగమించాయి.Most Popular