శిల్పా మెడికేర్‌కు రాయ్‌చూర్‌ కిక్‌!

శిల్పా మెడికేర్‌కు రాయ్‌చూర్‌ కిక్‌!

కర్ణాటకలోని రాయ్‌చూర్‌లోగల రెండు ఏపీఐ తయారీ ప్లాంట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి క్లీన్‌చిట్‌(ఈఐఆర్‌) లభించడంతో శిల్పా మెడికేర్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 11 శాతం(రూ. 41) దూసుకెళ్లింది. రూ. 422 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 434 వరకూ ఎగసింది.
జనవరిలో తనిఖీలు
రాయ్‌చూర్‌ ఏపీఐ ప్లాంట్లలో ఈ ఏడాది జనవరి 16-19 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు దేశీ ఫార్మా కంపెనీ శిల్పా మెడికేర్‌ పేర్కొంది. తాజాగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ తనిఖీల నివేదిక(ఈఐఆర్‌)ను జారీ చేసినట్లు తెలియజేసింది. Most Popular