క్రిధాన్‌ ఇన్‌ఫ్రాకు విజయ్‌ 'నిర్మాణ్‌' పుష్‌

క్రిధాన్‌ ఇన్‌ఫ్రాకు విజయ్‌ 'నిర్మాణ్‌' పుష్‌

సహచర సంస్థ విజయ్‌ నిర్మాణ్‌ కంపెనీ ఆర్డర్లను పొందినట్లు పేర్కొనడంతో క్రిధాన్‌ ఇన్‌ఫ్రా కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతంపైగా పెరిగి రూ. 82 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 85 వరకూ ఎగసింది. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయ నిర్మాణ పనులకుగాను రూ. 74 కోట్ల విలువైన కాంట్రాక్టులు విజయ్‌ నిర్మాణ్‌కు లభించినట్లు క్రిధాన్‌ తెలియజేసింది. వీటిని 5-7 నెలల్లోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది.Most Popular