కేఈసీ ఇంటర్నేషనల్‌కు ఆర్డర్ల దన్ను!

కేఈసీ ఇంటర్నేషనల్‌కు ఆర్డర్ల దన్ను!

వివిధ విభాగాల ద్వారా ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో ఈపీసీ సంస్థ కేఈసీ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.4 శాతం పెరిగి రూ. 345 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 350 వరకూ ఎగసింది. దేశ, విదేశాల నుంచి విద్యుత్‌ ప్రసారం, పంపిణీ విభాగం రూ. 1234 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందినట్లు కేఈసీ ఇంటర్నేషనల్‌ తెలియజేసింది. ఈ బాటలో కేబుళ్ల విభాగానికి సైతం రూ. 123 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు పేర్కొంది. Most Popular