11,000 మైలురాయివైపు నిఫ్టీ చూపు!

11,000 మైలురాయివైపు నిఫ్టీ చూపు!

వాణిజ్య వివాద ఆందోళనలు మళ్లీ ప్రపంచ మార్కెట్లలో వ్యాపించడంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. లాభాల బాట పట్టాయి. ఇప్పటికే సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 11,000 మార్క్‌పై కన్నేసింది. 27 పాయింట్లు బలపడి 10,974 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్రస్తుతం సెన్సెక్స్‌ 79 పాయింట్లు ఎగసి 36,318 వద్ద కదులుతోంది. 
మెటల్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 1.7 శాతం పతనంకాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం వెనకడుగు వేసింది. అయితే ఐటీ 1.5 శాతం జంప్‌చేయగా.. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐషర్‌, హెచ్‌పీసీఎల్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు కోల్‌ ఇండియా, హిందాల్కో, వేదాంతా, గెయిల్‌, యూపీఎల్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ 2.6-1 శాతం మధ్య నీరసించాయి. Most Popular