హిల్‌టాప్‌తో బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌కు జోష్‌

హిల్‌టాప్‌తో బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌కు జోష్‌

హిల్‌టాప్‌ కాంక్రీట్‌ను కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. హిల్‌టాప్‌ను సొంత అనుబంధ సంస్థగా మార్చుకునేందుకు అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌ పేర్కొంది. రెండు నెలల్లోగా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఏఏసీ బ్లాక్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా గుజరాత్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో విస్తరించనున్నట్లు తెలియజేసింది.Most Popular