ఫలితాలతో టీసీ'ఎస్‌'-3 శాతం ప్లస్‌!

ఫలితాలతో టీసీ'ఎస్‌'-3 శాతం ప్లస్‌!

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేయడంతో ప్రస్తుతం టీసీఎస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్ఈలో ఈ షేరు తొలుత రూ. 1929 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 2.5 శాతం బలపడి రూ. 1921 వద్ద ట్రేడవుతోంది.
పనితీరు ఇలా
త్రైమాసిక ప్రాతిపదికన క్యూ1లో టీసీఎస్‌ నికర లాభం   6.3 శాతం పెరిగి రూ. 7340 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 7 శాతం పుంజుకుని రూ. 34,261 కోట్లకు చేరింది.  డాలర్ల రూపేణా ఆదాయం దాదాపు 2 శాతం పెరిగి 505 కోట్ల డాలర్లను అధిగమించింది. Most Popular