గత వారాంతాన అమెరికా, చైనా పరస్పరం 34 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై టారిఫ్లను విధించుకోగా.. తాజాగా అమెరికా ప్రభుత్వం మరో 200 బిలియన్ డాలర్ల చైనీస్ దిగుమతులపై సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రెండు రోజులుగా మెరుగుపడ్డ సెంటిమెంటు మళ్లీ బలహీనపడింది. వాణిజ్య వివాద ఆందోళనలతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. చైనా ఇండెక్స్ షాంఘై కాంపోజిట్ దాదాపు 2 శాతం పతనమైంది.
వెనకడుగులో
ప్రస్తుతం ఇతర ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్, జపాన్ 1.5-1 శాతం మధ్య క్షీణించగా.. తైవాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేసియా 0.8-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి.