స్వల్ప నష్టాలతో షురూ- ఐటీ ఎదురీత!

స్వల్ప నష్టాలతో షురూ- ఐటీ ఎదురీత!

ఇప్పటికే అమెరికా, చైనా మధ్య ఏర్పడ్డ వాణిజ్య వివాదాలు మరింత పెరిగే సంకేతాలు కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ సెంటిమెంటు బలహీనపడింది. దీంతో ఆసియా మార్కెట్లు బలహీనపడగా.. దేశీయంగానూ రెండు రోజుల లాభాలకు చెక్‌ పడింది. మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 35 పాయింట్లు క్షీణించి 36,204కు చేరగా... నిఫ్టీ 13 పాయింట్ల వెనకడుగుతో 10,934 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. ఐటీ మాత్రమే బలపడింది. 
టీసీఎస్‌.. యస్‌..!
ప్రధానంగా మెటల్‌ 1.5 శాతం నీరసించగా..  ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఐటీ ఇండెక్స్‌ 1.3 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌ దాదాపు 3 శాతం జంప్‌చేయగా.. టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో ఐబీ హౌసింగ్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ 1-0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే మరోవైపు వేదాంతా, కోల్‌ ఇండియా, హిందాల్కో 1.5 శాతం చొప్పున క్షీణించాయి. మిగిలిన బ్లూచిప్స్‌లో సిప్లా, ఐటీసీ, యూపీఎల్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌ 1.25-0.7 శాతం మధ్య నష్టపోయాయి.Most Popular