ఈ రెండు షేర్లను పట్టుకోలేకపోతున్నాం..ఎక్కడ కొన్నా లాభమే

ఈ రెండు షేర్లను పట్టుకోలేకపోతున్నాం..ఎక్కడ కొన్నా లాభమే

సూచీలైనా అలుపు తీర్చుకోవడానికి అన్నట్లు 2018 కాస్త ఆగాయేమో కానీ, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ తయారీ సంస్థలైన గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు పెరుగుతూ రోజుకో గరిష్టాన్ని తాకుతూ రికార్డులు బద్దలు కొడుతున్నాయ్. గత మూడు క్వార్టర్లుగా అద్భుతమైన ఫలితాలు మదుపరులు అంచనా వేయగా..వాటిని మించి రాణించడమే ఇందుకు కారణం. మధ్యలో చైనాలో మైనింగ్ కంపెనీలపై నిషేధం ఎత్తివేసిన తర్వాత కాస్త వీటి జోరు తగ్గింది.
ప్రస్తుతం 2019 ఆర్ధిక సంవత్సరం ప్రథమ త్రైమాసికం ఫలితాలు విడుదల కానున్న నేపధ్యంలో హెచ్ఈజీ,గ్రాపైట్ ఇండియా స్టాక్స్ విపరీతమైన జోరు ప్రదర్శిస్తున్నాయ్.  ఎబిటాలో బీభత్సమైన వృధ్ది నమోదు అవుతుందని మదుపరులతో పాటు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లాంటి స్టాక్స్ బ్రోకింగ్ రీసెర్చ్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయ్. కనీసం ఎబిటా( వడ్డీ, పన్ను, విలువ తగ్గింపులు మినహాయించిన ఆదాయం)లో 66.7శాతం వరకూ పెరుగుతుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లెక్కవేసింది.రియలైజేషన్స్ 2019 ఆర్ధిక సంవత్సరంలో కూడా హెచ్ఈజీ విషయంలో బావుంటాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తన రిపోర్ట్‌లో చెప్పింది. ఉత్పత్తి సామర్ధ్యంలో 85శాతం హెచ్ఈజీ వినియోగించుకోగలదని చెప్తోంది. ఇక టాప్ లైన్ ఆదాయంలో ఏటికేడాది చొప్పున చూస్తే 648.88శాతం వృధ్ది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పద్దతిలో 19శాతం వృధ్ది నమోదు అవుతుందని అభిప్రాయపడింది. దీంతో కంపెనీ క్యు1లో కనీసం రూ.670కోట్ల నికరలాభం ఆర్జించగలుగుతుందని చెప్తోంది. ఇదే గత ఏడాది చూస్తే రూ.8.4కోట్ల నష్టం నమోదు కావడం గమనార్హం. ఇంత భారీ మలుపు తిరిగిన స్టోరీ ఈ మధ్యకాలంలో లేదు.

 ఇదే విధమైన అంచనా గ్రాపైట్ ఇండియా విషయంలోనూ వేస్తోంది ఐసిఐసిఐ సెక్యూరిటీస్.  గ్రాఫైట్ ఇండియా ఉత్పాదక సామర్ధ్య వినియోగం 90శాతం ఉంటుందట.  ఆ లెక్కన టాప్‌లైన్ రెవెన్యూ వచ్చేసి ఏడాది ప్రాతిపదికన రూ.1568కోట్లు(346.7శాతం వృధ్దితో), క్వార్టర్ ఆన్ క్వార్టర్  బేసిస్‌లో 29.3శాతం వృధ్ది నమోదు అవుతుంది. ఎబిటా మార్జిన్లలో 63.5శాతం పెరిగి, నికరలాభం కనీసం 663కోట్ల రూపాయలు ప్రకటిస్తుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ జోస్యం చెప్తోంది.  దీంతో ఈ రెండు షేర్ల ర్యాలీ ఇంకా ఆగదనీ భారీగా పెరుగుతుందని అంచనాలు నెలకొన్నాయ్. గత నెలలోనే మాక్వేరీ రీసెర్చ్ అంచనా ప్రకారం ఈ రెండు సంస్థల షేర్లు కనీసం మరో 40శాతం పెరుగుతాయి.


ఇక ఈ కేలండర్ ఇయర్‌ని చూస్తే, హెచ్ఈజీ 67శాతం, గ్రాఫైట్ ఇఁడియా 45శాతం పెరిగి అటు మదుపరులకు, ట్రేడర్లకు లాభాలు పంచాయ్. కథనం రాసే సమయానికి హెచ్ఈజీ 2.43శాతం పెరిగి రూ.3852.90 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 52వీక్స్ హై మార్క్ రూ.3885ని తాకడం విశేషం. అలానే గ్రాఫైట్ ఇండియా కూడా 2.05శాతం పెరిగి రూ.1010 వద్ద ట్రేడవుతోంది. 52 వారాల గరిష్టమైన రూ.1027ని కూడా ఇవాళే గ్రాపైట్ ఇండియా తాకగా..ఈ రెండు స్టాక్స్ ఉత్సాహం ఇదే రంగంలోని స్టాక్స్‌పైనా పడింది. ఈసాబ్ 2.35శాతం పెరిగి రూ.627.15 వద్ద , అడోర్ వెల్డింగ్ 2.48శాతం పెరిగి రూ.296 వద్ద ట్రేడవుతున్నాయ్.

( పై కథనం ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ రికమండేషన్ కాదు, షేర్ల పెరుగుదలపై కథనం మాత్రమే)Most Popular